నెల రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభం అయి ధాన్యాన్ని కలల్లో అరబోసుకున్న రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఎందుకు కొనుగోలు ప్రక్రియను ప్రారంభించడం లేదని, ఈ జాప్యం బోనస్ ఎగవేతకేన అని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. శనివారం డిచ్ పల్లి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరి కోతలు నెల రోజుల నుండి ప్రారంభించిన్న జిల్లాలో రైతులు కోసిన పంట ధాన్యాన్ని కళ్ళల్లో ఆరబోసుకొని ఎదురుచూస్తున్న ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించిక, ప్రారంభించిన కేంద్రాలలో ఒక్క గింజ కూడ కొనుగోలు చేపట్టక ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, కాలయాపన చేస్తూ కాలం వెళ్ళదిస్తుందని విమర్శించారు. వర్షాలు పడుతు కండ్ల ముందే ధాన్యం తడుస్తుంటే తీవ్ర ఆందోళనలో రైతులున్నారని ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ధాన్యన్ని ప్రయివేట్ వ్యాపారస్థులకు అమ్ముతు తరుగు పేరు మీద రైతులు లక్షల రూపాయలు నష్ట పోతున్నారని మండిపడ్డారు.రెండు లక్షల రుణమాఫీ పూర్తిగ అమలుగాక ఒక దిక్కు, ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా అందక మరో దిక్కు, చివరికి ఈ సీజన్ నుంచైనా బోనస్ కూడా వస్తదో రాదో అని పరేషాన్ లో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ చెప్పటాలని లేనట్లయితే రాబోయే రోజుల్లో రైతంగాంచే ఆందోళనలు చెప్పటాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎఐకెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవస్వామి,సిపిఐ ఎంఎల్ న్యూడేమోక్రసి మండల కార్యదర్శి జెపి పి గంగాధర్, జిల్లా నాయకులు బి గంగాధర్, బి బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.