నవతెలంగాణ న్యూఢిల్లీ: భారతదేశపు ప్రముఖ ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్ ఫిట్టింగ్‌లు మరియు సెక్యూరిటీ సొలయూషన్స్ ప్రదాత, ఓజోన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ (“OZONE”), దక్షిణ భారత దేశంలో , ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, హైదరాబాద్ మరియు విశాఖపట్నంలలో తమ ట్రేడ్‌మార్క్ మరియు ఇతర మేధో సంపత్తి హక్కులతో పాటుగా తమ బ్రాండ్ యొక్క అనధికారిక వినియోగంను అడ్డుకోవటానికి చట్టపరమైన చర్యలను చేపట్టింది.
ఇటీవల, కంపెనీ తమ ట్రేడ్‌మార్క్ “OZONE” మరియు “OZEN”ని అనధికారికంగా పలు సంస్థలు వినియోగిస్తున్నాయని అనేక సందర్భాలను నివేదించింది. ఈ సంస్థలు అనధికారంగా బ్రాండ్ ట్రేడ్ మార్క్ ను వినియోగించటం వల్ల వినియోగదారుల మధ్య గందరగోళానికి దారితీసింది మరియు బ్రాండ్ యొక్క ప్రతిష్టకు సైతం భంగం కలిగింది. తమ బ్రాండ్ విలువను భద్రపరుచుకునే ప్రయత్నంలో భాగంగా , OZONE ట్రేడ్‌మార్క్, డిజైన్ మరియు కాపీరైట్ ఉల్లంఘన సంఘటనలను ఢిల్లీ హైకోర్టు కు నివేదించటం తో పాటుగా చట్టపరమైన చర్యలను తీుకోవాల్సిందిగా అభ్యర్ధించింది.
ఆగస్టు 9, 2024న, గౌరవనీయమైన ఢిల్లీ హైకోర్టు OZONE కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మరియు హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలైన శ్రీ సిద్ధి వినాయక హార్డ్‌వేర్ సొల్యూషన్స్ మరియు టైటన్ హార్డ్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై నిషేధం విధించింది. కంపెనీ అనుమతి లేకుండా ట్రేడ్‌మార్క్ ‘OZONE మరియు OZEN’ మరియు సంబంధిత మెటీరియల్‌లను ఉపయోగించరాదని స్పష్టం చేసింది . 21.08.2024న పైన పేర్కొన్న సంస్థల యొక్క హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో సెర్చ్ మరియు సీజ్ ఆపరేషన్ నిర్వహించడానికి హైకోర్టు స్థానిక కమీషనర్‌ను నియమించింది, ఇందులో OZONE -బ్రాండెడ్ ఉత్పత్తుల యొక్క పెద్ద స్టాక్ రికవరీ చేయబడింది మరియు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీలు చేయబడింది.
మరొక కేసులో, హార్డ్‌వేర్ ఉత్పత్తుల కోసం ట్రేడ్‌మార్క్ “ప్లస్ OZONE”ను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ, హైదరాబాద్‌లోని కలాసిక్ గ్లాస్ & హార్డ్‌వేర్‌పై ఢిల్లీ కోర్టు శాశ్వత నిషేధాన్ని విధించింది. బ్రాండ్ తమ కస్టమర్‌లు, పంపిణీదారులు, ఛానెల్ భాగస్వాములు మరియు వాటాదారులను అప్రమత్తంగా ఉండాలని మరియు దాని ట్రేడ్‌మార్క్‌లను ఉల్లంఘించి రూపొందించిన అనుమానాస్పద ఉత్పత్తులను నివేదించాలని కోరింది. సంభావ్య నకిలీ లేదా అనధికారిక ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం కస్టమర్ సపోర్ట్ టీమ్‌కు customercare@ozone.in వద్ద లేదా +91 9310012300కి నివేదించాల్సి ఉంటుంది.