– కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎస్ఎఫ్ఐ పిలుపు
నవతెలంగాణ కంటేశ్వర్: అందరికీ విద్యా అందరికీ ఉపాధి హక్కు సాధనకై జనవరి 12న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నగర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర ఆఫీస్ బెరర్స్ సమావేశం సంఘ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ.. అందరికీ విద్య-అందరికి ఉపాధి హక్కు సాధనకై జనవరి 12న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అని అన్నారు.
చలో ఢిల్లీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత పదేండ్లగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు లబ్ది చేకూర్చే లాగా విధివిధానాలు రూపొదిస్తున్నారు. అదే విధంగా శాస్త్రీయ విద్యను తిరోగమనంలోకి నెట్టే వేసే విధంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానం 2020 విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దేశవ్యాప్తంగా చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని అలాగే ఉన్నత విద్యకు అధిక నిధులు కేటాయించాలి అని అన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో మత పరమైన విషయాలపై చూపిస్తున్న శ్రద్ద ,విద్యారంగ సమస్యలను పరిష్కరనికి చూపకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. విద్య రంగ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయడానికి విద్యార్థులందరూ తరలి రావాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షు,కార్యదర్శులు విశాల్, పోషమైన మహేష్ నగర ఆఫీస్ బెరార్స్ దీపిక, గణేష్, వేణుగోపాల్ పాల్గొన్నారు.