వడ్డిలేని రుణాల అందజేతపై హర్షం..

– సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ – బెజ్జంకి 
మహిళలకు ఆర్థిక చేయూతనందించాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డిలేని రుణాలు అందించడంపై మండలంలోని అయా గ్రామాల మహిళ సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భరతమాత మహిళ సమైక్య సంఘాలకు రూ.50,28,748 వడ్డిలేని రుణాలందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా శనివారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి భరతమాత మహిళ సమైక్య అధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఏపీఎం నర్సయ్య,సీసీలు తిరుపతి,పద్మ,వీఓఏలు పాల్గొన్నారు.