నవతెలంగాణ – నెల్లికుదురు
వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ అధిక బడ్జెట్ కేటాయించడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ తెలిపాడు శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి మరియు మంత్రివర్గానికి కృతజ్ఞతలు అని అన్నారు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో 25% వ్యవసాయానికి నిధులు కేటాయించడం ఇది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. గత ప్రభుత్వం వాస్తవానికి దూరంగా బడ్జెట్ కేటాయింపు చేసేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంది. గత ప్రభుత్వ రుణమాఫీ కి ప్రతి బడ్జెట్లో పేరుకే నిధులు కేటాయించి వాటిని ఖర్చు చేయలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ప్రతి పైసా వెంటనే రైతులకు అందిస్తుంది. ఇది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ సిద్ధ శుద్ధి రైతు రుణమాఫీ కి పెద్దపీట వేసింది ఎన్నికల ముందు చెప్పినట్టుగా వ్యవసాయ కూలీలకు వరి పంట బోనస్ కి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి ఇది రైతు ప్రభుత్వం అన్ని నిరూపించుకున్న ప్రభుత్వానికి రాష్ట్ర రైతుల తరఫున కృతజ్ఞతలు అని తెలిపారు.