
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ ల సంక్షేమానికి రాష్ట బడ్జెట్ లో 2024,2025 సంవత్సరాని కి రూ.3003 కొట్లు ఇచ్చి పెద్దపీట వేయడం చాలా సంతోషకరం అని ఉమ్మడి రాష్ట్రం లో కూడ ఇంత మొత్తంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ఇవ్వలేదనీ తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ ఎండి హాఫిజ్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ..గత బిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ లకు 2014 నుండి 2023 సంవత్సరం లొ రూ.2050 కోట్లు ఒకసారి రూ.2200 కోట్లు కేటాయించింది కానీ మొత్తంగా 500 కొట్లు కూడ కర్చుపెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి ఇంత పెద్దపీట అని తెలంగాణ ముస్లిం మైనారిటీ లకూ పెద్ధ శుభవార్త అన్నారు. బడ్జెట్ కేటాయింపులొ అధిక నిధులు కేటాయించిన సిఎం రేవంత్ రెడ్డి ,ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టివిక్రమార్క కు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు,జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.