– మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పొరిక బలరాం నాయక్ పేరు ప్రకటించిన పట్ల నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ హర్ష వ్యక్తం ప్రకటిస్తుందని మాజీ జెడ్పీటీసీ హెచ్ వెంకటేశ్వర్లు అన్నాడు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేదర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరిక బలరాం నాయక్ గతంలో ఎంపీగా ఉండి మాజీ కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఎంతో ఉందని అన్నాడు. మంత్రిగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అని అన్నారు. విద్య, వైద్యం రైల్వే రోడ్లు పరంగా కోట్లాది నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత బలరాం నాయక దక్కిందని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మళ్ళీ ఎంపీగా అవకాశం కల్పించడం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందం నింపిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కంకణ బద్ధులై ఉండి గెలుపుకు కృషి చేస్తారని తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సల్గు పూర్ణచందర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జేల్లా యాకయ్య నాయకులు గడ్డం అరుణ్ కుమార్ వరిపల్లి ఉప్పలయ్య షేరు వెంకట మల్ల పోతరాజు శ్రీనివాస్ అజ్జు డాక్టర్ వెంకటేశ్వర్లు కొమరవెల్లి నరసయ్య మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.