పశువుల నీటి తొట్టి శుభ్రం చేయించడం పట్ల హర్షం

Delighted to clean the cattle troughనవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రతం గల్లి లో గల పశువుల నీటి తొట్టిని గ్రామపంచాయతీ కార్యదర్శి పంచాయతీ ప్రత్యేక అధికారి ప్రత్యేక దృష్టితో 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయించడం పట్ల, అధికారుల పనితీరుపై గల్లి ప్రజలు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వర్షాకాలం అయినందున నీటి శుభ్రత పట్ల అధికారుల చర్యలు అభినందనీయమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మనుషులకైనా పశువులకైనా వర్షాకాలంలో కలుషిత నీరు త్రాగుతే డయోరియా వంటి వ్యాధులు వస్తాయి. అలాంటి వ్యాధులు పశువులకు కూడా రాకుండా ముందు జాగ్రత్తగా 15 రోజులకు ఒకసారి పశువుల నీటితోటిని శుభ్రం చేస్తున్నారు.