ఎమ్మెల్సీగా మహేష్ కుమార్  నియామకం  పట్ల హర్షం

 నవతెలంగాణ –  భీంగల్
ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్  నియామకం పట్ల ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్ హర్షం వ్యక్తం చేశారు. భీంగల్ మండల ప్రాంతానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను గుర్తించి అధిష్టానం ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేల కోటా కింద  నియమించిందని  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని  పార్టీకి  నాయకులు, కార్యకర్తలు అందించిన సేవలను అధిష్టానం ఎప్పుడూ  గమనంలో ఉంచుకుంటూ అలాంటి వారికి ఉన్నత పదవులను ఇవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని  రెహమాన్ తెలిపారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా హర్షం వ్యక్తం చేశారు.