నిధుల మంజూరు పట్ల హర్షం వ్యక్తం..

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఉమ్మడి దుబ్బాక మండలం(అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని) తాళ్లపల్లి గ్రామానికి చెందిన దుబ్బాక మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోడోల దేవరాజు, టిఆర్ఎస్ నాయకులు నర్సింలు దమ్మగని ప్రశాంత్ గౌడ్ లు మంగళవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని పోతారం గ్రామంలోని ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను వారు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా.. డ్రైనేజీ పనులకు రూ .10 లక్షలు, ఓపెన్ జిమ్ పనులకు నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.ఈ సమస్యలకు ఎంపీ స్పందించి తొందరలోనే నిధులు మంజురు చేస్తానని హామీ ఇవ్వడంతో వారు హర్షం  వ్యక్తం చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు వేల్పుల నరసింహులుకు ఎంపీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్ తినిపించారు. కార్యక్రమంలో దుబ్బాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాణాల శీనివాస్, పలువురు నాయకులు ఉన్నారు.