ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో, ఎంపీడీవో కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. భువనగిరి మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు,  హైస్కూలు విద్యార్తులకి పండ్లు పంపిణీ చేశారు. వీధి నిరాశ్రయులకు భువనగిరి బస్ స్టాండ్ లో, రేణుకా ఎల్లమ్మ గుడిలో , రైల్వే స్టేషన్ ఆహారం పంపిణీ చేశారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పుట్ట శివయాదవ్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్లమస రవి గౌడ్, పుట్ట కృష్ణ యాదవ్, మచ్చ నవీన్ గౌడ్ లు పాల్గొన్నారు.