రోడ్డు ప్రమాదంలో డెలివరీ బారు మృతి

నవతెలంగాణ-మియాపూర్‌
మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సైబర్‌ టవర్‌ జంక్షన్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బారు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఎస్‌ఐ రవికిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆకుల దుర్గాప్రసాద్‌ (40) స్విగ్గీ డెలివరీ బారు స్థానికంగా మూసాపేట్‌లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉదయం అతను శిల్పారామం మాదాపూర్‌ నుంచి తన బైక్‌ నెంబర్‌ ఎపీ 09 డబ్ల్యూ 0368 పై వెళ్లుతుండగా మార్గమధ్యలో సైబర్‌ టవర్‌ గేట్‌ ఎదుట యూటర్న్‌ తీసుకుంటున్నప్పుడు, అదే సమయంలో వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ కూకట్‌పల్లి వైపు నుంచి తన వాహనాన్ని అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్‌ రైడర్‌ను ఢకొీట్టాడు. దీంతో అతను బైక్‌పై నుంచి కింద పడటంతో ఆ వాహనమే అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై, అక్కడి క్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.