రైతులకు రుణమాఫీ చేయాలని ధర్నా..

Dharna to waive off loans to farmers..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రైతులకు మూడు విడుదలల్లో వచ్చిన రుణమాఫీ డబ్బులను ఇంతవరకు రైతులకు చెల్లించడం లేదని ఆరోపిస్తూ బిజెపి మండల శాఖ, కిషన్ మోర్ఛ ఆధ్వర్యంలో చందుపట్ల సొసైటీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు చిర్క సురేష్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి మండలంలోని చందుపట్ల సోసైటీ పరిధిలో ఎనిమిది గ్రామాలకు సంబంధించిన రుణమాఫీ మూడు విడుదలగా వచ్చిన ఏ ఒక్క రైతుకు ఇంతవరకు చెల్లించలేదని, ఎస్బిఐ బ్యాంకు పేరు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీపై అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదన్నారు.  రైతు రుణమాఫీ కూడా కొంతమందికి వచ్చిందని, అధికారుల అలసత్వం వలన చాలామంది రైతులు నష్టపోయారని ఆరోపించారు. అనంతరం బ్యాంకు చైర్మన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు పకిర్ రాజేందర్ రెడ్డి, వల్దాసు రాజు, కాలభైరవ, మాణిక్యం రెడ్డి, మాటరి అనీల్, భాస్కర్, కృష్ణ, కర్ణకర్, సాయి, గోవర్ధన్, అశోక్, శివ , సొసైటి రైతులు పాల్గొన్నారు.