హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్‌కు డిమాండ్‌

Demand for office space in Hyderabad– నైట్‌ ఫ్రాంక్‌ రిపోర్ట్‌
హైదరాబాద్‌ : దేశంలోనే అత్యధిక కొత్తగా కట్టిన కార్యాలయాలను పూర్తి చేసిన నగరంగా హైదరాబాద్‌ నమోదయ్యిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం (క్యూ3)లో నగరంలో 29 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవాలు జరిగాయని ఇండియా రియల్‌ ఎస్టేట్‌ క్యూ3-2023 రిపోర్ట్‌లో వెల్లడించింది. గడిచిన త్రైమాసికంలో 53 లక్షల ఆఫీసు స్పేస్‌ నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొంది. దేశంలోని ఎనిమిది మార్కెట్‌లలో డెలివరీ చేయబడిన ఆఫీస్‌ స్పేస్‌లో 46శాతం హైదరాబాద్‌ వాటా ఉందన్నారు. సగటు లావాదేవీ అద్దె నెలకు చదరపు అడుగుకి రూ.65.3గా ఉందని పేర్కొంది.