బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌
దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కమిటి సమావేశాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి చుక్క రాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను అప్రజా స్వామికంగా కూలదోసి అనేక రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వక్రమార్గాలను అనుసరిస్తున్నదన్నారు. రాజ్యాంగంలో మార్పులు తీసుకువస్తూ అనేక చట్టాలను మార్పు చేసి ఎన్నికల విధా నంలో కూడా మార్పులు తీసుకువచ్చి రాజ్యాంగ బద్దంగా వచ్చిన హక్కులన్నింటిని కాలరాస్తున్నదని విమర్శించారు. జమిలీ ఎన్నికల పేరుతో అధ్యక్ష తరహా పాలన తీసుకువచ్చేందుకు కుట్రలు చేస్తు న్నారన్నారు. రాజ్యాంగంలో కార్మిక వర్గానికి ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయని ఈ చట్టాల్లో మార్పులు చేసి పెట్టుబడుదారులు కార్పొరేషన్‌ అనుకూలంగా విధానాలు చేపడుతున్నారని ఫలితంగా కార్మిక వర్గం ప్రజలపై అదనపు భారాలు మోపి వారి జీవన ప్రమాణాలు కూడా దెబ్బతి స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అనేక సంవ త్సరాల నుండి మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసినప్పటికీ ఈ చట్టాన్ని జనాభా జన గనన తర్వాత అమలు చేస్తానని చెప్పడం చట్ట మమ్మల్ని పట్ల మహిళా లోకం పట్ల బిజెపి కున్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. దేశంలో నిరు ద్యోగం, పేదరికం, ఆకలి తీవ్రస్థాయిలో పెరిగిపోయాయని వీటన్నింటినీ కప్పిపుచ్చి విశ్వ గురువుగా పేదరికం చాటున ప్రచారం చేసుకోవడం సరైనది కాదన్నారు. లౌకిక దేశమైన భారత దేశంలో అన్ని కులాలు, మతాల సమన్యాయం ఉందని అలాంటి దేశంలో కలిసి ఉన్న ప్రజల మధ్య విభజనలు తీసుకురావడం సరైనది కాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిగా రాజ్యాంగంలోని మౌలిక అంశాలను తొలగించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, రాష్ట్రాల హక్కులను హరించివేసి ఫెడరలిజానికి తూర్పు పొడుస్తునారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని రానున్న ఎన్నికల్లో మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్‌, దాసరి కళావతి, సంద బోయిన ఎల్లయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, గొడ్డు బర్ల భాస్కర్‌, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో, ఆలేటి యాదగిరి, చొప్పరి రవికుమార్‌, బద్దిపడగ కష్ణారెడ్డి, అమ్ములబాల నరసయ్య, శ్రీనివాస్‌, సనాధి భాస్కర్‌, అత్తిని శారద, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.