– ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మంది ప్రాణాలను రక్షించిన ర్యాట్ హోల్ మైనర్ల బృందం నాయకులు వకీల్ హాసన్ ఇల్లును ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా డిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అక్రమంగా కూల్చేయటం దుర్మార్గమని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్యాస్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కూల్చేసిన స్థలంలోనే ప్రభుత్వం పునర్నిర్మాణం చేసివ్వాలని డిమాండ్ చేశారు. డిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నియమించిన లెప్ట్‌నెంట్ జనరల్ చేతిలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇదంతా జరగదని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం పేదలను, మైనారిటీలను, దళితులను, గిరిజనులను వేధింపులకు గురిచేస్తున్నదని బుల్డోజర్ రాజకీయాలతో వారి జీవనాధారాలను, ఇండ్లను కూల్చేసి, నిలవనీడ లేకుండా చేయాలని చూస్తున్నదని తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూ ఆచరణలో మతోన్మాద, ఆధిపత్య విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు.