15న కలెక్టరేట్ల ఎదుట ప్రదర్శనలు

– 30న ఇందిరాపార్క్‌ వద్ద మౌనదీక్ష: టాప్ర రాష్ట్ర కన్వీనర్‌ స్వరాజ్‌కుమార్‌ భట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పెన్షన్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ప్రదర్శనలను నిర్వహిస్తామని టాప్ర రాష్ట్ర కన్వీనర్‌ స్వరాజ్‌కుమార్‌ భట్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మౌనదీక్ష చేపడతామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టాప్ర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టాప్ర ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే అమలు చేయాలని కోరారు.