
ఇంటర్ పరీక్షలు నాగార్జునసాగర్ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు వెనక్కి పంపారు. నిమిషం ఆలస్యం అయితే అనుమతించమని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దింతో బుధవారం నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5గురు విద్యార్థులు 5నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష సెంటర్ లోకి అనుమతించలేదు. సెంటర్ గేట్లను మూసివేయడం జరిగింది. దీంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు పరీక్ష రాయలేక వెనుదిరిగిపోయారు.