హిందూ ధర్మాన్ని కించపరిస్తే సహించేదే లేదు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
ధర్నా చేస్తున్న హిందూ సంఘాలు హిందూ ధర్మాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చిన తమిళనాడు మంత్రి.. డీఎంకే యువజన విభాగం అధినేత ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే అరెస్టు చేయాలని హిందూసంఘం సభ్యులుడిమాండ్ చేస్తున్నారు. పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగానికి కట్టుబడి కులమత, రాగద్వేషాలకు అతీతంగా సకలజనుల శ్రేయస్సుకోసం పని చేస్తానని ప్రమాణం చేసిన మంత్రి.. కంత్రి పనులు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా.. లేక పరమ పవిత్రుడైన శ్రీరామచంద్రుడినే అవమానించిన కరుణానిధి రచించిన రాజ్యాంగం నడుస్తుందా అని అయన ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించడం ఉదయనిధికి తగదని అయన హెచ్చరించారు. విచ్ఛిన్నం.. విధ్వంసం నేటి ఆధునిక సమాజంలో పనికిరావని పగుడాకుల బాలస్వామి తేల్చి చెప్పారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని అనేక కుట్రలు పన్నిన మహమ్మదీయులు, ఆంగ్లేయులు కాలగర్భంలో కలిసిపోయారనే విషయం గుర్తు చేసుకోవాలిన పగుడాకుల బాలస్వామి అన్నారు. హిందూ ధర్మం శాశ్వతమైనదని.. దానికి మరణం లేదనే విషయన్నీ ఆయన గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై అడ్డమైన కూతలు కూస్తే.. తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.ఓటుబ్యాంకురాజకీయాలకోసంహిందూధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదనిహిందూసంఘాల సభ్యులు హెచ్చరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో తానాజీరావు, రమేష్,యోగేశ్వర్,రాజేష్,సంతోష్ దేశాయ్, వెంకన్న సెట్,యోగేశ్వర్, యాదు, వెంకట్ గౌడ్,నవీన్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,హిందూసంఘసభ్యులు పాల్గొన్నారు.