పాఠశాలలను సందర్శించిన డీఈఓ దుర్గాప్రసాద్

నవతెలంగాణ – రెంజల్

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో రెంజల్ మండలంలోని ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, సోటాపూర్ ఫారం ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ మంగళవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. రాబోవు పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమై నిర్భయంగా భయం లేకుండా పరీక్షలను రాయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. మార్చి 18 వరకు ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థిని విద్యార్థులకు అంకిత భావంతో బోధించి ప్రతి ఒక్కరు ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు. అవసరమైతే ప్రత్యేక శిక్షణను ఇవ్వాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. త్వరలో ఫ్రీ ఫైనల్ పరీక్షలను విద్యార్థులకు నిర్వహించి వారి ప్రతిభను గమనించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ బలరాం, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల నిర్వహకురాలు శ్యామల, సాఠాపూర్ ఫారం ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కాజా నసీరుద్దీన్, ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయేషా, చిన్నప్ప, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు స్వప్న, తదితరులు పాల్గొన్నారు.