
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నూతన 2025వ సంవత్సర డైరీలను రూపొందించారు. గురువారం జిల్లా విద్యాధికారి ప్రణిత చేతుల మీదుగా ఆమె కార్యాలయంలో నాయకులు ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.. ప్రభుత్వం విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం పాటుపడుతుందని తెలిపారు. దేశంలోనే మొట్ట మొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణకె అన్ని విద్యార్థి సంఘాలు పాటుపడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గేడం కేశవ్, జిల్లా నాయకులు రమేష్, శైలజ, వైశాలి, పూజ, మౌనిక, శారద, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.