పాఠశాలను సందర్శించిన డీఈఓ

పాఠశాలను సందర్శించిన డీఈఓనవతెలంగాణ-తలమడుగు
మండలంలోని సుంకిడి ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలను సోమవారం డీఈఓ ప్రణీత సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకొని పెచ్చులూడుతున్న తరగతి గదులను పరిశీలించి, వాటిని తక్షణమే రిపేర్లు చేయించాలని ఎంఈఓ నారాయణను చరవాణిలో ఆదేశించారు. మన ఊరు మనబడిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో నిర్మించబడ్డ నాలుగు గదులను వర్షాకాలం పూర్తయ్యేంతవరకు నాలుగు నెలలపాటు ఉన్నత పాఠశాల తరగతుల బోధన కోసం వాడుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశాల మేరకు తాను పాఠశాలను సందర్శించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎనిమిది, తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులతో తరగతి గదిలోకి వెళ్లి కష్టపడి చదవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులతో గణితం లెక్కలు చేయించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు గజానన్‌, వై. రామ్‌రెడ్డి, సుకుమార్‌ పేట్కులే, శ్రీనివాస్‌రెడ్డి, సుజాత, నాందేవ్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్‌ ఉన్నారు.