– ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్
బర్మింగ్‌హామ్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు పోరాటానికి తెరపడింది. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్స్ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్ సీడ్ అన్‌సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో సింధు 19-21, 11-21తో పరాజయం పాలైంది. 42 నిమిషాల పాటు సాగిన క్వార్టర్‌ఫైనల్లో సింధు వరుస గేముల్లో చేతులెత్తేసింది. తొలి గేమ్‌లో 4-1తో ముందంజ వేసిన సింధు ఆధిక్యం నిలుపుకోలేదు. 4-4 వద్ద స్కోరు సమం చేసిన యంగ్.. 11-8తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో పుంజుకునేందుకు సింధు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక రెండో గేమ్‌లోనూ సింధు నిరాశపరిచింది. 3-3 నుంచి దూసుకెళ్లిన యంగ్ 11-6తో విరామ సమయానికి ఆధిక్యం సాధించింది. 21-11తో అలవోకగా రెండో గేమ్‌ను, సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.