మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన బొమ్మిడి రాములు అనారోగ్యంతో బాధపడుతుండటంతో బుధవారం ఆలన సెంటర్ కు సమాచారం అందించగా, ఆలన బృందం రోగి ఇంటి వద్ద ప్రథమ చికిత్స నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి లోని ఆలన సెంటర్ కు తరలించారు. కార్యక్రమంలో వైద్యులు పటేల్ గణేశం, కే రాజేష్, సుప్రియ, ఆశాలు తోట యశోద, కవిత తదితరులు ఉన్నారు.