– నిబంధనల పేరుతో ఇంక్రిమెంట్ కట్..
– తీవ్రంగా నష్టపోతున్న కార్మికులు
నవతెలంగాణ – అచ్చంపేట
ఆర్టీసీ ఆదాయం కోసం కష్టపడి నిరంతరంగా కృషి చేస్తున్న కార్మికుల పట్ల అచ్చంపేట డిపో మేనేజర్ నిర్లక్ష్యంగా వహిస్తూ చిన్నచిన్న కారణాలకు. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట డిపో పరిధిలో 115 మంది డ్రైవర్లు 150 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబంలో ఏర్పడిన అకాల పరిస్థితుల కారణంగా విధులకు హాజరు కాకపోతే… సీట్ టు డిఎం అనే విధానం ద్వారా కార్మికులను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. కుటుంబ ఇబ్బందుల కారణంగా, వ్యక్తిగత అనారోగ్య కారణం వల్ల ఒకరోజు విధులకు హాజరు కాకపోతే.. తర్వాత రోజు విధులకు పోవాలని కార్మికులు వెళ్లినప్పటికీ డిపో మేనేజర్ కలవకుండా మరో రెండు రోజులు విధులకు హాజరు కాకుండా కల్పిస్తున్నారు. దీనివల్ల ఒక్కొక్క కార్మికుడు రోజుకు మూడు వేల రూపాయలు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను అచ్చంపేట డిపోలో ప్రతినెల 15 మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కార్మికులకు ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ మేనేజరు వచ్చిన తర్వాత దాదాపు 15 మంది కార్మికులు ఇంక్రిమెంట్ బ్యాక్ అయ్యారని సమాచారం తెలిసింది. మహిళ కార్మికులను అని చూడకుండా కుటుంబ అవసరాలు, వ్యక్తిగత సమస్యలు చెప్పినప్పటికీ కనీసం కనికరం లేకుండా కనికరించడం లేదని పేరు చెప్పలేని కొందరు కార్మికులు ఆరోపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు కానీ సమస్యలు బయటకు చెప్పుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. గతంలో ఎంతోమంది డిపో మేనేజర్లు పనిచేశారు. కానీ ఈ డిపో మేనేజర్ కావాలని కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు.