– మరో నాలుగు పైసలు పతనం
– డాలర్‌తో రూ. 85.79 కనిష్టానికి..
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ మరింత క్షీణించి.. నూతన రికార్డ్ కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ నాలుగు పైసలు పతనమై డాలర్‌తో 85.79 కనిష్ట స్థాయికి దిగజారింది. భారత కరెన్సీ చరిత్రలోనే ఇది మరో అత్యంత కనిష్టం. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి విలువ బలహీనంగా ప్రారంభమై.. ఇంట్రాడేలో ఏకంగా 85.80 రికార్డ్ కనిష్ట స్థాయిని తాకింది. గురువారం సెషన్‌లోనూ 11 కోల్పోయి 85.75 వద్ద ముగిసింది. డిసెంబర్ 27న ఇంట్రాడేలో 85.80 కనిష్టాన్ని తాకి.. జీవితకాల కనిష్టాన్ని చవి చూసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అత్యంత బలహీనమైన గణంకాలు, స్టాక్ మార్కెట్ల వరుస పతనం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోవడం, పేలవ ఎగుమతుల తీరు, దిగుమతులు పెరగడం తదితర అంశాలు రూపాయి విలువను క్షీణించేలా చేస్తున్నాయి.