ఉపాధ్యాయుల డిప్టేషన్లను మార్గదర్శకాలకు లోబడి చేపట్టాలి..

నవతెలంగాణ – కంటేశ్వర్
ఉపాధ్యాయుల డిప్టేషన్లను మార్గదర్శకాలకు లోబడి చేపట్టాలని డిటిఎస్ నాయకులు శనివారం ప్రకటనలో జిల్లా అధ్యక్షులు బాలయ్య ప్రధాన కార్యదర్శి రాజన్న లో డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టని కారణంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయoగా పెరిగిన కారణంగా అనేక పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్నవి. మరికొన్ని పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యకు ఉండవలసిన ఉపాధ్యాయుల కంటే అదనపు ఉపాధ్యాయులు కూడా ఉన్న పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా ఉన్నవి. కావున ఈనెల 22న జిల్లా విద్యాశాఖ వెలువరించిన ఉత్తర్వుల సంఖ్య Rc No,1914/B2/2023 తేదీ 22/6/2023 ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ కొరకై ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాలకు లోబడి డిప్యూటేషన్లు పెట్టాలని అoదుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకలను మండల విద్యాశాఖ అధికారులకు జారీచేసి ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక మండలాలలో జిల్లా విద్యాశాఖ అధికారుల ముందస్తు అనుమతులు తీసుకోకుండా మండల విద్యాశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు పెట్టడం వల్ల అనేక విమర్శలకు తావిచ్చింది .అక్రమ డిప్యూటేషన్లకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గతంలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించిన సందర్భాలు ఉన్నాయి. కావున వివాదాస్పదం కాకుండా పారదర్శకంగా డిప్యూటేషన్లు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.