నవతెలంగాణ – బజార్ హత్నూర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నెల 7న బుధవారం మండలంని పిప్పిరి గ్రామానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పర్యటన నిర్వహించబోతున్న సభాస్థలిని, హేలిప్యాడ్ నిర్మాణ స్థలాన్ని, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో మండల నాయకులు కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధికారులతో మాట్లాడి పర్యటన సందర్భంగా ప్రజల సౌకర్యార్థం అన్ని వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచాలని ఎటువంటి లోటు రాకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ పిప్రి గ్రామం నుండి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ ప్రాంతం నుంచే బీజం పడిందని అందుకే ఈ ప్రాంతానికి అధిక నిధులు కేటాయించి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని, బహిరంగ సభ సందర్భంగా ఈ ప్రాంతానికి వరాలజల్లు ఉంటుందని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ, మాజీ జెడ్పిటిసిలు మల్లెపూల నరసయ్య, గోక గణేష్ రెడ్డి, తలమడుగు మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నియోజకవర్గ నాయకులు, పలు మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.