నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బృందం విదేశీ పర్యటన ముగిసింది. గతనెల 24వ తేదీ సింగరేణి సీఎమ్‌డీ ఎన్ బలరాం, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యుత్‌శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ తదితరులతో కలిసి అమెరికా, జపాన్ దేశాల్లో అధికారికంగా పర్యటిం చారు. ఆయా దేశాల్లోని పలు ప్రముఖ కంపెనీలను క్షేత్రస్థాయిలో సంద ర్శించి, సాంకేతికాంశాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రి 9.30 గంట లకు ఈ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి తిరిగి చేరుకుంది. వారికి పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. 13 రోజుల విదేశీ పర్యటనలో అంతర్జాతీయ మైనింగ్ ఎగ్జిబిషన్ మైనెక్స్-2024లో కూడా పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీతో పాటు పలు అంశాలను వారు అధ్యయనం చేశారు.