
హిందీ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని జాంబాగ్ వార్డు కార్యాలయాన్ని గోషామహల్ జిహెచ్ఎంసి సర్కిల్ -14 డిప్యూటీ కమిషనర్ డి. బాలయ్య గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు కార్యాలయాల కు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై వార్డు అడ్మిని స్టెటివ్ ఆఫీసర్ ఏ సతీష్ కుమార్ ను ఆయన అడిగి తెలుసుకున్నారు. జాంబగ్ వార్డు కార్యాలయంలో 10 విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్ అధికారి నాగరాజు, ఇంజనీరింగ్ ఏఈ సిహెచ్ భవాని, యు సి డి అధికారి సమ్మయ్య, పారిశుద్ధ్యం ఎస్ ఎఫ్ ఏ సత్యనారాయణ, ఎంటమాలజీ అధికారి దిలీప్, ఆపరేటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.