మాదక ద్రవ్యాల నూతన చట్టంపై వివరించిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనర్సయ్య

Deputy Director of Prosecutor Lakshminarasaiyya briefed on the new Narcotics Actనవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మినర్సయ్య, నిజామాబాద్ / కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమావేశములో నూతనంగా అమలులోకి వచ్చిన మాదక ద్రవ్యాలను నూతన చట్టాల ద్వారా అరికట్టే చర్యల గురించి బాధితులకు, సాక్షులకు సాక్షం ఇచ్చుటలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటి డైరెక్టర్ లక్ష్మీనర్సయ్య క్లుప్తంగా వివరించినారు.ఈ సమావేశంలో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి. రాజేశ్వర్, రాజారెడ్డి, బంటు వసంత్, జి. శ్యాంరావు, నిమ్మ దామోధర్ రెడ్డి, శ్రీనివాస్ ఖాందేష్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు : జి. రామకృష్ణ, యం.డి. రహిముద్దిన్, భూసారపు రాజేష్ గౌడ్, చిదిరాల రాణి, అశోక్ శివరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.