ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామంలోని అర్ ఏం పీ క్లినిక్ ను జిల్లా డీఏం అండ్ ఎచ్ఓ అంజన శుక్రవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా కల్లెడ గ్రామానికి చెందిన ఆయెషా అనుమానాస్పద మృతిపై విచారణ చేయడానికి డీఏం అండ్ ఇచ్ఓ డా. అంజన కల్లెడ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన అయేషా ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. అదే విధంగా. మృతురాలికి ట్రీట్మెంట్ ఇచ్చిన అర్ఏం అండ్ ఇచ్ఓ సునీల్ వర్మ కు చెందిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను టెంపరరీ గా సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ప్రవీణ్ రెడ్డి, ప్రసాద్, గ్రామ కార్యదర్శి చంద్ర శేఖర్ పాల్గొన్నారు.