భువనగిరి మండలము బోల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శిల్పిని హాజరై, మాట్లాడారు. 12 రకాల డయాగ్నొస్టిక్ పరీక్షలు అర్హులైన లబ్ధిదారులకు సేవలు అందించాలన్నారు. ఆయుష్మాన్ కార్డు (హెల్త్ ఐడి ) కార్డులు , టిబి స్క్రీనింగ్, చికిత్స, జనాభా గణన, కమ్యూనిటీ బేస్డ్ అసెస్‌మెంట్ చెక్‌లిస్ట్ , ఆశ, ఎన్సీడీల స్క్రీనింగ్ , చికిత్స, సికిల్ సెల్ స్క్రీనింగ్, చికిత్స సేవలు అందుతాయని తెలిపారు. యోగా, వ్యక్తిగత పరిశుభ్రత ఆహార వైవిధ్యం, పోషకాహారం (రక్తహీనతతో సహా), పదార్థ దుర్వినియోగం, పొగాకు, ఆల్కహాల్ , డ్రగ్స్, మానసిక ఆరోగ్యం సేవలపై ఆరోగ్యవిద్య అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ యామిని, పల్లె దవాఖాన డాక్టర్లు మురళి, తులసి ప్రీతి కాంచన నిఖిల్ విజయ దివ్య ,పర్యవేక్షణ అధికారులు రమాదేవి ,రేణుక, విజయ, ప్రఫుల్ల పుష్ప ,సురేష్ కుమార్, జె.వి ఎన్ రెడ్డి ,,కిరణ్, వసుధ,కస్తూరి, వినోద లు పాల్గొన్నారు.