రెంజల్ మండలం తాడి బిలోలి ఆరోగ్య ఉపకేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్వో విద్య శుక్రవారం తనిఖీ చేశారు. ఆరోగ్య సిబ్బందికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని బలోపేతం చేయడానికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సంబంధించిన దస్తావేజులను ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామాల్లోకి వెళ్లి ప్రతి శుక్రవారం ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు ఫ్రైడే ఫ్రైడే కు సంబంధించిన పనులను ఆమె పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నివారణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లోని డ్రైనేజీలను ఆ మే క్షుణంగా పరిశీలించారు. ఆరోగ్య సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్, జేల్ల రవి, లక్ష్మీనారాయణ, నిర్మల, మంజుల, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.