విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

– 100% ఇంటి పన్నులు వసూలు, నర్సరీలలో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి

నవతెలంగాణ – రెంజల్
గ్రామ కార్యదర్శి లు గ్రామాలలో 100% పన్నుల వసూలు, వేసవి నీ దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శులపై ఉందని ఎంపీడీవో శంకర్ పేర్కొన్నారు. గురువారం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిలకు, క్షేత్ర సహాయకులకు, మేటీలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వేయిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నర్సరీల పెంపకంలో క్షేత్రస్థాయికులు నిర్లక్ష్యం వహించకుండా ప్రతిరోజు నర్సరీలకు నీటిని అదించే విధంగా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ మొయినుద్దీన్, సూపరిండెడ్ శ్రీనివాస్, ఏపీవో రమణ, ఈసీ శరత్చంద్ర, గ్రామ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, పాల్గొన్నారు.