నవతెలంగాణ – అచ్చంపేట
లక్ష్మాపూర్ నుండి చెంచు పలుగు తండాకు బీటి రోడ్డు వేయాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశానాయక్, తండా ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చెంచు పలుగు తండాలో గ్రామ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశనాయక్ మాట్లాడారు. 2023 అక్టోబర్ లో చెంచు పలుగు తండ వరకు బీటీ రోడ్డు వేయాలని పనులు ప్రారంభించినారు. నిధులు లేవని రోడ్డు పనులు నిలుపుదల చేశారని అన్నారు. ఫారెస్ట్ భూములకు పట్టాలు, ధరణి సమస్యలు పరిష్కారం చేయాలని, రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఐ(ఎం) బృందం దృష్టికి తీసుకొచ్చినట్ల తెలిపారు. 2007 సంవత్సరంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశామని, ఇప్పటివరకు కూడా తండావాసులకు పట్టాలు ఇవ్వలేదని, వెంటనే ఇవ్వాలని అన్నారు. అర్హులైన వారికి పింఛన్లు ఇచ్చి పరిష్కారం చేయాలని అన్నారు. లేనిచో ఈనెల 29న అచ్చంపేట ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్ మల్లేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అఖిలేష్, తండా ప్రజలు రవీందర్, రవినాయక్, భాస్కర్, మహిళలు దేవిలీ, పింప్లి , లక్ష్మి, టీకే నాయక్ తదితరులు ఉన్నారు.