– గాయత్రి, ట్రెసా జోడీ ఓటమి
– గపూర్ ఓపెన్ సూపర్ 750
సింగపూర్ : సింగపూర్ ఓపెన్‌లో సంచలన విజయాలు నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన భారత యువ జోడీ పుల్లెల గాయత్రి, ట్రెసా జాలి సెమీఫైనల్లో పోరాడి ఓడారు. వరల్డ్ నం.2, వరల్డ్ నం.6 దక్షిణ కొరియా షట్లర్లపై అద్భుత విజయాలు సాధించిన గాయత్రి, ట్రెసా మెరుపు ప్రయాణం సెమీస్‌లోనే ముగిసింది. వరల్డ్ నం.4 జపాన్ షట్లర్ల చేతిలో 21-23, 11-21తో పరాజయం పాలయ్యారు. 47 నిమిషాల్లోనే ముగిసిన సెమీస్‌లో తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. 16-16, 20-20, 21-21 వరకు గట్టి పోటి ఇచ్చిన గాయత్రి, ట్రెసాలు ఆఖర్లో తడబడ్డారు. రెండో గేమ్‌లో జపాన్ జోడీ అలవోకగా నెగ్గింది.