
-హుస్నాబాద్ లో అభివృద్ధి యజ్ఞం ఆగొద్దు
-హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవ తెలంగాణ హుస్నాబాద్ రూరల్
గౌరవెల్లి ప్రాజెక్టు అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసిన ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశానని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని పోతారు ఎస్ గ్రామంలోని శుభం గార్డెన్ లో అక్కన్నపేట మండల బీ ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ల క్రితం హుస్నాబాద్ లో సాగు తాగునీరు కరువు ఉండేదని, నేడ పరిస్థితి మారిపోయిందని అన్నారు. గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోతోందన్నారు. హుస్నాబాద్ అభివృద్ధి యజ్ఞం ఆగొద్దని అభివృద్ధిని కొనసాగిద్దామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీ బలంగా ఉందని, గులాబీ పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని అన్నారు. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయిందన్నారు. ఈ ప్
రాంత కరువును గౌరవెల్లి ప్రాజెక్టు శాశ్వతంగా దూరం చేస్తుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గౌరవెల్లిని పూర్తి చేశామని, ఈ ప్రాంత రైతులు, ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు కల నిజం కాబోతోందని అయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి , జెడ్పిటిసి భూక్య మంగ శ్రీనివాస్, ఎంపీపీ మాలోతు లక్ష్మీ బిల్లు నాయక్, అక్కన్నపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు , వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
