వాతావరణ శాఖ హెచ్చరించినా.. చర్యలేవీ? : బండి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిదని పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన 20 మందికి చెందిన కుటుంబాలకు రూ.20 లక్షలు, ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.