ఇందల్ వాయి మండల కేంద్రంలోని శ్రీ వేంకట సాయి మేటర్స్ ద్విచక్ర వాహనాల షోరూం లో గురువారం తిర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి చింతల దాస్, ఎస్ అనిల్ రెడ్డి,ఎస్ రవిందర్ రెడ్డి తదితరులతో కలిసి నూతనంగా వచ్చిన డెస్టినీ 125 సి సి ని మార్కేట్ లో విడుదల చేశారు.ఈ సందర్భంగా శ్రీ వేంకట సాయి షోరూం యాజమాని ఎస్ అనిల్ రెడ్డి, ఎస్ రవిందర్ రెడ్డి మాట్లాడుతూ హీరో కంపెనీ ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్లో స్కూటర్ డెస్టినీ 125 సిసిని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని షోరూంలలో విడుదల చేయడం జరిగిందన్నారు. ఈసారి వచ్చిన డెస్టిన్ 125 నూతన అంగులతో సుందరంగా తయారు చేసినట్లు వారు వివరించారు. ఈ విడుదల కార్యక్రమంలో షోరూం మెకానిక్ షేక్ ఫిర్దోస్, రెహమాన్,శూభం, మనోజ్, శ్రీను, గంగాధర్, సాయిబాబా, నరేష్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.