
భూతగాదాలతో పలు కుటుంబాల మధ్య దాడులు, వాహనాల ధ్వంసం, పోలీసుల చొరవతో సద్దుమణిగిన ఘటన మండలంలోని రెడ్డి పేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన పొన్నగంటి రాజయ్య తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురికి ఆరెకరాల వ్యవసాయ పొలం ఉండగా, నాలుగు ఎకరాల 20 గుంటలు పట్టా, ఒక ఎకరం 20 గుంటలు అసైన్మెంట్ భూమి ఉండగా, చిన్న నాన్న పట్టా ల్యాండ్ అదే గ్రామానికి చెందిన జిల్లా రాజు, రవి, సుభాష్ కుటుంబాలకు విక్రయించగా, చిన్న నాన్న నరసయ్య మృతి చెందగా, మిగిలిన 30 గుంటల అసైన్డ్ భూమికోసం గత కొద్ది రోజుల నుండి ఇరు కుటుంబాల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. శనివారం తహసిల్దార్, పోలీస్ స్టేషన్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం గ్రామ బస్టాండ్ లో పొనుగంటి రాజయ్య, ఆయన కొడుకులు రవి, రాజనర్సపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, వారిని ఆసుపత్రులకు తరలించగా, ముదిరాజ్ కుల పెద్దలు, జిల్లా రాజు, రవి, సుభాష్ వాళ్లను వివరణ కోరడానికి వెళ్లగా, మాట మాట పెరిగి సున్నం మహేష్ పై ఆటో రాడుతో చితక బాధగా తల పగిలి తీవ్ర గాయం కావడంతో 108 లో ఆస్పత్రికి తరలించారు. పొన్నగంటి రాజయ్య కులస్తులైన ముదిరాజులు ఆగ్రహించి, గంగపుత్రులైన జిల్లా రాజు, రవి, సుభాష్ కు చెందిన రెండు ఆటోలను, బైకులను, టవేరా ను ధ్వంసం చేయగా, పోలీసులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని, రాజు, రవి, సుభాష్ కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పొనుగంటి రాజయ్య కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుల తెలిపారు. పొనుగంటి రవి, సున్నం మహేష్ లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.