
– 500 ఇండ్ల దరఖాస్తులకు ఒక సర్వేయర్ నియామకం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, సంక్షేమ హాస్టల్స్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 80 లక్షల మంది వివరాలను డిసెంబర్ నెలాఖరు లోగా పకడ్బందీగా సేకరించాలని అన్నారు. బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, నూతన డైట్ మెనూ పెంపు ప్రారంభోత్సవం కార్యక్రమం, సంక్షేమ హాస్టల్స్ తనికి , తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ వీడీయో కాన్ఫరెన్స్ హాల్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,డి సి పి రాజేష్ చంద్ర, రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణధికారి శోభా రాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హౌసింగ్ శ్రీరాములు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.