క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించండి: క్యాన్సర్ జయించండి

– నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్
– జీజీహెచ్ లో జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ వేడుకలు 
నవతెలంగాణ –  కంటేశ్వర్
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ఆసుపత్రి నిజామాబాదులో నిర్వహించిన సదస్సులో  ముఖ్య అతిధి జిల్లా జడ్జి  కే.సునీత  మరియు  జిల్లా న్యాయ సేవ అధికారి (డి.యస్.ఎల్.ఎ ) పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ ముందుగా మహిళా వైద్యులందరికీ   జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని , కాలానుగుణంగా క్రమం తప్పకుండా అన్ని రకాల పరిక్షలు చేయించుకోవాలని సూచించారు. అడగననే జిల్లా కోర్టు మహిళా ఉద్యోగులకు మరియు జిల్లా ఫారెస్ట్ మహిళా ఉద్యోగులకు  ఇక్కడ స్క్కాన్నింగ్  పరీక్షల ఏర్పాటు చేసినందుకు డా. ప్రతిమ రాజ్కి ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశం లో డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరిoటెండెంట్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాద్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి ఈ క్యాన్సర్ వ్యాధి అని, ప్రతి 6 మరణాలలో 1 క్యాన్సర్ మరణం ఉంటుందని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సగానికి పైగా క్యాన్సర్ మరణాలు ఉంటాయని మేధావుల అంచనా  అని తెలియజేశారు. ఉదయంలేవడం, వ్యాయ మాలు చేసుకోవడం, దైనందిన పనులు ఎవరికీ వారే చేసుకోవడం వల్ల కూడా  కొంత శారిరాక శ్రమ అవుతుంది అని సూచించారు. ఇక్కడికి వచ్చిన జిల్లా కోర్టు మహిళా ఉద్యోగులకు  జిల్లా ఫారెస్ట్ మహిళా ఉద్యోగులకు  మరియు ఆసుపత్రి  మహిళా సిబ్బందికి  మామో గ్రాఫ్ ( దాదాపురూ. 3000/-) , పాప్ స్మియర్( దాదాపురూ. 5000/-) పరీక్షలను  ఉచింతగా నిర్వహిస్తున్నామన్నారు.క్యాన్సర్ పై అవగాహన కల్పించడం కోసం నిర్వహిస్తున్న క్యాన్సర్ దినోత్సవo, సదస్సుల, రన్ లు క్యాన్సర్ రోగుల ను మానసికంగా దృఢపరచి క్యాన్సర్ ను జయించవచ్చు అని వారిలో నమ్మకాన్ని పెంచడానికి అని తెలియజేశారు. ఈ క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స పొంది క్యాన్సర్ ను జయించాలని సూచించారు. స్త్రీలలో గర్భాశయ మరియు బ్రిస్ట్ క్యాన్సర్లను గుర్తించడానికి వారు తగిన పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. అలాగే పురుషులలో పొగాకు వలన ఎక్కువ సంభవిస్తుందని, అందుకే ధూమపాన నిషేధంతో క్యాన్సర్ను నివారించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా. సరస్వతి, డా. పూర్ణిమ , డా. అనుపమ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.