– అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024 జ్ఞాపకార్థం
నవతెలంగాణ న్యూఢిల్లీ: రెకిట్స్ ఫ్లాగ్ షిప్ కాంపైన్, డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా (బిఎస్ఐ) అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024ను సంబరంలో భాగంగా, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం చేతులు కడుక్కోవడం యొక్క ప్రాధాన్యత పై భారతదేశంవ్యాప్తంగా 30 మిలియన్ పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ‘క్లీన్ హ్యాండ్స్ ఫర్ ఆల్: అడ్వాన్సింగ్ హెల్త్ ఈక్విటీ త్రూ హైజీన్’ ఇతివృత్తంగా, ఈ కార్యక్రమం అన్ని స్థాయిలకు చెందిన పిల్లలకు ప్రధానమైన పరిశుభ్రత గురించి అవగాహన ఉండాలని, ఎవరూ ఈ విషయంలో వెనకబడకూడదని నిర్థారించడంలో డెట్టాల్ బిఎస్ఐ యొక్క నిబద్ధతను తెలియచేస్తోంది.
అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024 సందర్భంగా, బిఎస్ఐ కింద డెట్టాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 100+ భాగస్వాముల మద్దతుతో 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 30 మిలియన్ పిల్లలను నిమగ్నం చేసింది. పబ్లిక్ ,ప్రైవేట్, ప్రభుత్వ సహాయంతో పని చేసే మరియు అన్ ఎయిడెడ్ రంగాలలో మరియు భారతదేశంవ్యాప్తంగా సర్వోదయ విద్యాలయాస్, నవోదయ విద్యాలయాస్, ఆర్మీ పాఠశాలలు మరియు కేంద్రీయ విద్యాలయాలు సహా పాఠశాలల్లో పాల్గొనడం ద్వారా సక్రమంగా చేతులు శుభ్రం చేసుకునే టెక్నిక్కులను ఈ కాంపైన్ ప్రోత్సహించింది.
చొరవ యొక్క నిరంతర ఆవిష్కరణలో భాగంగా, డెట్టాల్ బిఎస్ఐ హైజీయా అనగా గ్రీకుల ఆరోగ్యం, పరిశుభ్రత, మరియు శుభ్రతల దేవత ప్రేరణతో డెట్టాల్ హైజీన్ చాట్ బాట్, హైజీయా ఫర్ గుడ్ హైజీన్ ను విడుదల చేసింది. ఈ AI ఆధారిత, వాట్సాప్ ప్రారంభించబడిన చాట్ బాట్ 7 భాషల్లో- హిందీ, ఇంగ్లిష్, తమిళం, కన్నడం, ఒడియా, గుజరాతీ, తెలుగు భాషలలో పరిశుభ్రత గురించి కీలకమైన విజ్ఞాన అందిస్తుంది. – 22 అధికారిక భారతీయ భాషల్లో కూడా విస్తరించే ప్రణాళికలను కలిగి ఉంది. గొప్ప ప్రమేయం మరియు చైతన్యాన్ని ప్రోత్సహించే స్వీయ-శిక్షణ, స్వీయ-సహాయం సాధనాలు మరియు ఇంటరాక్టివ్ ప్లాట్ ఫాంస్ కోసం పెరుగుతున్న అవసరాన్ని చాట్ బాట్ సూచిస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రవి భట్నాగర్, ఎక్స్ టర్నల్ అఫైర్స్ మరియు పార్ట్ నర్ షిప్స్ డైరెక్టర్, రెకిట్ దక్షిణాసియా, ఇలా అన్నారు, “పరిశుభ్రతా అవగాహన కోసం మరియు ప్రతి చిన్నారి కోసం ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించడానికి రెకిట్ లో మేము అడ్డంకులను తొలగించడానికి కట్టుబడ్డాము. పరిశుభ్రతా సమానత్వానికి మా దీర్ఘకాల నిబద్ధత అనేది భారత ప్రభుత్వం వారి క్లీన్ ఇండియా ఉద్యమంతో ఒక దశాబ్దానికి పైగా అనుసంధానమైంది, ప్రతి చిన్నారికి-, వారు ఏ నేపధ్యానికి చెందిన వారైనా- జీవితాన్ని కాపాడే చేతులు శుభ్రం చేసుకునే పద్ధతిని నేర్చుకోవడాన్ని నిర్థారించడంలో ఇది కేంద్రీకరించబడింది. మేము ఇటీవల ఈ చొరవ యొక్క 11వ సంవత్సరంలో అడుగు పెట్టడంతో, పరిశుభ్రతా సమానత్వంపై మా ప్రాధాన్యత ఇంతకు ముందు కంటే శక్తివంతంగా ఉంది, ‘ఒక్కరు కూడా వెనకబడకూడదు‘ అనే మా విస్తృతమైన మిషన్ కు మద్దతునిస్తోంది.
ఒక్క 2023లోనే, కాంపైన్ 34 బిలియన్ హ్యాండ్ వాషింగ్ సందర్భాలను సులభతరం చేసింది, దేశవ్యాప్తంగా మంచి పరిశుభ్రతా అలవాట్లను ప్రోత్సహించడానికి తమ అంకితభావాన్ని పునః శక్తివంతం కలిగించింది. కాంపైన్ తమ కొనసాగుతున్న ఇతివృత్తం ‘వన్ వరల్డ్ హైజీన్ ‘ ద్వారా టాయ్ లెట్ ను వినియోగించిన తరువాత, తినడానికి ముందు, ఆహారం తయారు చేయడానికి ముందు,
గ్రామాలయ ఫౌండర్, పద్మశ్రీ ఎస్.దామోదరన్ మాట్లాడుతూ గ్రామీణ సమాజాల్లో పరిశుభ్రతా అవగాహన యొక్క ప్రాధాన్యతను తెలియచేసారు, “నీళ్లు వ్యాధులను పోగొడుతాయి. జీవితాన్ని నిలబెడతాయని అని రుగ్వేదం బోధించింది. సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యం, మరియు పరిశుభ్రతలు- ప్రత్యేకించి సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం అనారోగ్యాన్ని నివారించడానికి ప్రధానం. అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ కాంపైన్ ద్వారా, డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా మరియు గ్రామాలయాలు మెరుగైన ఆరోగ్యం మరియు పరిశుభ్రతల కోసం 1 కోటి మంది పిల్లలకు చేతులను శుభ్రం చేసే పద్ధతులను బోధించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి.
ప్లాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ అసిఫ్ మాట్లాడుతూ “సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ప్రాథమికమైన హక్కు మరియు పిల్లలు అందరికీ మరియు ప్రజలకు అవసరం. ప్లాన్ ఇండియాలో, మేము ప్రతి చిన్నారి, ప్రతి కుటుంబం, మరియు ప్రతి కమ్యూనిటీకి పరిశుభ్రతా సదుపాయాలు చైతన్యం అందుబాటులో ఉండటాన్ని నిర్థారించే దిశగా పని చేయడం కొనసాగిస్తాము. అందువలన ఒక్కరు కూడా ఈ సదుపాయం పొందకుండా మిగిలిపోరు. ప్రతి వ్యక్తి వర్థిల్లే ఆరోగ్యకరమైన, పరిశుభ్రతా-చైతన్యం కలిగిన దేశాన్ని సృష్టించడానికి మనం చేతులు కలుపుదాం“ అన్నారు.
మమత హెచ్ఐఎంసి డిప్యూటీ సిఈఓ సంజీవ్ ధామ్ మాట్లాడుతూ“మేము అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం జరుపుతున్నందున, డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా కాంపైన్ లో భాగంగా ఉండటానికి మమత హెచ్ఐఎంసిలో ఆనందిస్తున్నాము. రెకిట్స్ మద్దతు చేసే పాఠశాలల్లో పరిశుభ్రత గురించి అవగాహనను ప్రోత్సహించడానికి ఇది ఒక ఉమ్మడి ప్రయత్నం. కలిసికట్టుగా, వ్యాధితో పోరాడటంలో పరిశుభ్రమైన చేతులు ఒక శక్తివంతమైన సాధనం అని అర్థం చేసుకోవడంలో మేము ఆధునిక తరానికి సాధికారత కలిగిస్తున్నాం. మనం చేతులను శుభ్రం చేసుకుందాం మరియు ఈ విషయాన్ని ప్రచారం చేద్దాం! పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి అలవాటుగా మారుద్దాం” అన్నారు.
డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా పాల్గొనడం, సాంస్కృతిపరంగా సంబంధిత చొరవల ద్వారా సేవలు అందని సమాజాలకు పరిశుభ్రతా వ్యవస్థలను కేటాయించడం ద్వారా సమానంగా ఆరోగ్యాన్ని కలిగి ఉండే హక్కును ప్రోత్సహించడానికి కట్టుబడింది. అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2025 ముగియబోతున్న నేపధ్యంలో, గ్రామాలయ, డెట్టాల్ బిఎస్ఐ సహకారంతో, సమాజంలో అన్ని వర్గాలలో పరిశుభ్రతా చైతన్యాన్ని వ్యాప్తి చేస్తోంది. ఉద్యమంలో పాల్గొనడానికి, మీ యొక్క వాట్సాప్ సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్ నుండి టోల్ ఫ్రీ నంబర్ 18001236848 కి మిస్డ్ కాల్ ఇవ్వండి.