అర్చక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: దేవాదాయ అర్చక సంఘం

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
దేవాదాయ శాఖలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక, ఉద్యోగ సంఘాల ఐకాస ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జేఏసీ గౌరవాధ్యక్షుడు గంధం కరుణాకర్ నాయుడు, కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, కార్యనిర్వా హక అధ్యక్షుడు అగ్నిహోత్రం చంద్రశేఖరశర్మ, అర్చక సంఘం అధ్యక్షుడు సి. హెచ్.బద్రీనాథాచా ర్యులు, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారిలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ను కలిసి పెండింగ్ సమస్యలను విన్న వించారు. గత ప్రభుత్వం ప్రకటించిన ఐఆర్అర్చక, ఉద్యోగులకు వర్తింపజేయాలని, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియా మకం ద్వారా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేత నాలు చెల్లించాలని వినతిపత్రం అందజేశారు.