సరికొత్త ఐడియాతో దేవకి నందన వాసుదేవ

Devaki Nandana Vasudeva with a new ideaఅశోక్‌ గల్లా హీరోగా రూపొందుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దేవకి నందన వాసుదేవ’. ‘గుణ 369’ దర్శకుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఆదివారం ప్రసాద్‌ ల్యాబ్‌లో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. గురు పూర్ణిమ సందర్భంగా నవంబర్‌ 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత బాలకృష్ణ మాట్లాడుతూ, ‘మా సినిమా రిలీజ్‌ టైమ్‌లో మట్కా, కంగువా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అవి వచ్చినా సరే మా సినిమా మాదే. మాది సక్సెస్‌ అవుతుందనే నమ్ముతున్నాను. మేం కొత్తవాళ్లమే అయిన మంచి అవుట్‌పుట్‌తో మంచి ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాం. థియేటర్‌లో సినిమా చూశాక మంచి సినిమా తీశామనే ఫీలింగ్‌ మీకూ కలుగుతుంది. ప్రశాంత్‌ వర్మ సరికొత్త ఐడియాతో కథ రాశారు. సంగీత దర్శకుడు భీమ్స్‌ ఆకట్టుకునేలా మంచి బాణీలు ఇచ్చారు. సాయిమాధవ్‌ బుర్రా పదునైన మాటలు రాశారు. దర్శకుడు ఫర్‌ఫెక్ట్‌గా సినిమాను చేశారు’ అని అన్నారు.
‘ఇందులో నా పాత్రపేరు సత్యభామ. అందుకే పాత్రకు కనెక్ట్‌ అయ్యాను. తనకు ఎలాంటి ఒత్తిడిలు ఉన్నా ధైర్యంతో ముందుకుసాగే పాత్ర. కమర్షియల్‌ డివైన్‌ థ్రిల్లర్‌ సినిమాగా రూపొందించారు. అందరినీ అలరించేదిగా ఉంటుంది’ అని కథానాయిక మానస చెప్పారు. దర్శకుడు అర్జున్‌ మాట్లాడుతూ, ‘గొప్ప చిత్రం చేశానని చెప్పగలను. ప్రశాంత్‌ ఇచ్చిన కథ యూనిక్‌ స్టయిల్‌లో ఉంది. పక్కా కమర్షియల్‌ సినిమాగా తీశాం. గతంలో ఇలాంటి కథ రాలేదు’ అని తెలిపారు. ఇది నాకు రెండో సినిమా. ప్రశాంత్‌ వర్మ కథ అంటే ప్రేక్షకులకు ఏదో గట్టి కథ ఉంటుందని గ్రహించేస్తారు.
ఈ కథలో సోల్‌ చాలా డెప్త్‌గా ఉంటుంది. ఇంత కమర్షియల్‌ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీశారు. ఇక హీరోయిన్‌ మానసకు ఇదొక ఛాలెంజింగ్‌ రోల్‌. ఈ సినిమా తర్వాత ఆమె స్థాయి పెరుగుతుంది. నవంబర్‌ 14న సినిమా సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్‌కి టర్నింగ్‌ అవుతుంది.
– హీరో అశోక్‌ గల్లా