రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు దేవర కార్తీక్ ఎంపిక ఎంఈఓ డాక్టర్ రామన్

నవతెలంగాణ – ధర్మసాగర్
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ధర్మసాగర్  9వ తరగతి విద్యార్థి  దేవర కార్తీక్ ఎంపికైనట్లు ఎంఈఓ డాక్టర్ రామన్ తెలిపారు.బుధవారం మండల కేంద్రంలో ని ప్రభుత్వ బాలుర పాఠశాలలో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.పాఠశాల నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్ 17 విభాగంలో నిర్వహించబడిన సాఫ్ట్బాల్ పోటీలల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిజామాబాదులో  డిసెంబర్ 7 నుండి 9 వరకు మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి పోటీలల్లో పాల్గొంటారని చెప్పారు.జిల్లా స్థాయి లెవెల్లో ఈ పాఠశాల నుండి దేవర కార్తీక్ మంచి ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం చాలా శుభ పరిణామం అని అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఇలాంటి ప్రతిభ గలవారిని ప్రభుత్వం గుర్తిస్తుందనీ గుర్తు చేశారు. ఏది ఏమైనాప్పటికీ రాష్ట్రస్థాయి పోటీలకు కార్తీక్ ఎంపిక కావడంతో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు బి ప్రసన్న ను అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాలలో దేవర కార్తీక్  అభినందించి,ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.