అభివృద్ధి చేసా.. ఆదరించండి..

– మళ్లీ గెలిస్తే మరింత అభివృద్ధి..
– రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ- డిచ్ పల్లి:  ఈ పదేళ్ల కాలంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మూడవసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని రెట్టింపు అభివృద్ధి చేస్తానని రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని బర్దిపూర్, గోల్లపల్లి, నడిపల్లితండా గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ రూరల్ ఇన్చార్జి వి.గంగాధరౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేయాలని తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సిఎం కేసీఆర్ను మూడవసారి సిఎం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుండాలన్నారు. కరోనా సమయంలో రెండుసార్లు తనకు కరోనా వచ్చినా ధైర్యంతో ఉంటూనే నియోజకవర్గ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నానని గుర్తు చేశారు. అదే ఇతర పార్టీల నాయకులు పత్తాలేకుండా పోయారని, ఎన్నికలు రాగానే ఎనలేని ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. తాను అక్రమాస్తులు కూడబెట్టినట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆరోపణలు చేస్తున్న ఆ నాయకుడికే రెండింతల ఆస్తి ఉందన్నారు. ప్రజలకు ఏదో చెప్పి హీరో అవుదామని అనుకుంటే పొరపాటేనని, ఎన్నటికీ జీరోగానే ఉండిపోతారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ లు చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చి నెల నుంచి రేషన్కార్డుదారులందరీకి సన్నబియ్యం అందజేస్తామన్నారు. అర్హులైన బీడీ కార్మికులందరికి ఎన్నికల తర్వాత కటాప్ డేట్ను ఎత్తివేసి అందరికీ పింఛన్లు అందజేస్తామన్నారు. రైతుబంధు ఎకరానికి 18 వేలు వంతులవారిగా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ ముస్లీం తేడా లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మహిళలకు రూ.2వేలు పింఛను ఇస్తుంటే అందులోనుంచి బీజేపీ రూ. 1200 లకు సిలిండర్ పేరిట తీసుకుంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 400 లకే సిలిండర్ అందజేస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మీ పథకంలో భాగంగా అర్హులైన మహిళలందరికీ రూ.3వేలు పింఛను అందజేస్తామన్నారు. కేసీఆర్ బీమా ద్వారా తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఇంటికి రైతుబీమా తరహాలోనే రూ.5 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. అసైన్డ్ భూములపై ఉండే ఆంక్షలను ఎత్తివేసి యజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు సమకూరుస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ.15 లక్షల ఉచిత వైద్య సదుపాయం అందజేస్తామన్నారు. అంతకు ముందు మహిళలు మంగళహారతులు, బోనాలు, చేపలవల తో ఘనస్వాగతం పలికారు. మద్యాహ్నం డిచ్పల్లి స్టేషన్, నడిపల్లి లో జరిగిన ఎన్నికల ప్రచారంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ.. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేసి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నీరడి సుజన, గుడాల లింగం, ప్రమిల రాజేష్, ఎంపీటీసీలు ఉగ్గేర కృష్ణవేణి, దండుగుల సాయిలు జెడ్పిటీసీ దాసరి ఇందిర లక్ష్మినర్సయ్య, కోఆప్షన్ నయీం, పార్టీ మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, నాయకులు నీరడి పద్మారావు, నారాయణరెడ్డి, మోహన్రెడ్డి, కృష్ణ, అమీర్, విఠల్, కలగర శ్రీనివాస్, పత్తి ఆనంద్, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.