
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని బీర్కూర్ ఎంపీపీ రఘు తెలిపారు. శుక్రవారం బీర్కూరు మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బీర్కూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రఘు అధ్యక్షతనలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఎంపిటిసి సభ్యులు మండల డివిజన్ అధికారులు హాజరయ్యారు. మండల పరిధిలోని ఉన్న అధికారులు వారి వారి శాఖల నివేదికలను చదివి వినిపించారు. సభ ప్రారంభంకాగానే ఎంపీటీసీలు, సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. బీర్కూర్ ఎంపీటీసీ సందీప్ మాట్లాడుతూ స్థానిక అవసరాల కోసం ప్రభుత్వం ఇసుకను సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన స్థానిక అధికారులు స్థానిక అవసరాలకు ఇసుక ఇవ్వడం లేదంటూ వారు సమస్యను లేవనెత్తారు. గతంలో ఇలాంటి సమస్య ఎప్పుడు రాలేదని ఇసుక లేకుండా గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం నిలిచిపోయాయని వారు సభ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే అధికారులు స్పందించి స్థానిక అవసరాల కొరకు ఇసుకను ఇవ్వాలంటూ వారు కోరారు. వివిధ గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీరు రాణి రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు చెప్పారు.
గత ప్రభుత్వం హయాంలోనే మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తవద్దని అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. వేసవికాలం దృష్ట విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంటుందని విద్యుత్ కొరత లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను కోరారు. గ్రామాల్లో వ్యవసాయానికి, గృహాలకు అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తున్నారని పలువురు ఎంపీటీసీ సభ్యులు సభలో సమస్యను లేవనెత్తారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతుల పంటల వివరాలను సేకరించామని మండల వ్యవస్థ అధికారిని కమల సభ దృష్టికి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని నిత్యం వ్యవసాయ సిబ్బంది మ్యాచరింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారని ఆమె తెలిపారు. మండలంలో ఉన్న గ్రామపంచాయతీ విద్యుత్ బకాయిల బిల్లులు ప్రభుత్వ నుండి రావడంలేదని అందుకు గ్రామపంచాయతీ అధికారులు చెల్లించాలంటూ విద్యుత్ అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధి అధికారులు, ఎంపిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.