
నవతెలంగాణ – నెల్లికుదురు
బీఆర్ఎస్ పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత అండతో నెల్లికుదురు పట్టణ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు వీరగాని మల్లేష్ గౌడ్ అన్నాడు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ని తన నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లికుదురు పట్టణ గ్రామ సర్పంచ్ గా పోటీలో ఉంటున్నానని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఎమ్మెల్సీ పక్కలపల్లి రవీందర్రావును ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలని కలుస్తున్నారని అందరి అండదండలు నాకు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాబోయేది అధికారం బీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మంత్రుల సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి పట్టణ కేంద్రాన్ని రంగాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.